పండగ వస్తే చిన్న రాతి బొమ్మనో ,వెండి బొమ్మనో లేదా చక్కని దేవుడి ఫోటోనో పెట్టేసి ఏ మల్లెల దండనో చేమంతుల దండో వేస్తే ఇంటికే అందం వచ్చేది. ఇప్పుడు కథ మారింది. పండగకు ఇల్లే దేవాలయం అయిపోతుంది. ఫోటోలకు బదులుగా అందమైన వాల్ పేపర్లు వచ్చాయి.అచ్చంగా దేవుడే మనల్ని చూసి నవ్వుతున్నట్లు త్రీడీ బొమ్మలు వచ్చాయి.ఈ నెలలో వరలక్షీ వ్రతం, కొద్ది రోజుల్లో వినాయక చతుర్ధి ఈ పండగల కోసం అందమైన అలంకారాలలో వాల్ పేపర్లు గది గోడలు మొత్తం ఆక్రమిస్తున్నాయి.ఇళ్ళ అలంకరణలో కూడ ఒక అధ్యాత్మిక వాతావరణం సృష్టించాలంటే గది గోడ మొత్తం శ్రీరామ పట్టాబిసషేకమో,శివ పార్వతులు,దశావతారాలు అన్ని త్రీడీల్లో వాల్ పేపర్లు లాగా గోడలకు అంటించేస్తే గుడి ఇంట్లోకి వచ్చినట్లే కదా.

Leave a comment