లాక్ డౌన్ షరతులకు లోబడి ఇంట్లోనే ఉండవలసిందే కదా .ఐతే అత్యవసర వస్తువుల కోసం గడప దాటాలి .అప్పుడు కూడా ఇంటికి ఒక్కళ్ళే బయట కాలు పెట్టాలి తప్పని సరిగా మన చుట్టూ ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాలి .ఒళ్ళంతా కప్పేసే దుస్తులు వేసుకొని బయట నుంచి లోపలి అడుగు పెట్టాక స్నానం చేసి ఆ దుస్తులు ఉతికి ఆరేయాలి .వాటిని ఇతర గుడ్డలతో కలిపి పాడేసి ఉంచద్దు .ఎప్పటి కప్పుడు ఉతకవలసిందే .పర్సు ఒక్కటే బయటకు తీసుకుపోవాలి .శానిటైజర్ తో పర్సు ని కూడా శుభ్రం చేయాలి .మొబైల్ ను బయటకి తీసుకుపోయినా శానిటైజర్ వాడి శుభ్రంగా తుడవాలి .షాపింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఏ శరీర భాగాలు మొహం, ముక్కు ,జుట్టు ఏవి చేతుల తో  తాకవద్దు .ఇలాటి జాగ్రత్తలు పాటిస్తే ఏ వైరస్ కూడా దగ్గరకు రాలేదు .

Leave a comment