ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతర సంబరాలు ప్రారంభం గోల్కొండ ఎల్లమ్మ తల్లితోనే. కన్నుల పండుగగా ఆలయాన్ని వేప మండలతో అలంకరించి,రంగవల్లులతో తీర్చిదిద్దుతారు.ఈ ఆలయం గోల్కొండ కోట నవాబు కాలంలో అక్కన్న,మాదన్నలు కట్టించారు.ఆషాఢ మాసంలో వాతావరణ మార్పులకి పిల్లలకు అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామదేవత ఎల్లమ్మ కు తొట్టెలు కడతామని,బోనంతో నైవేద్యం సమర్పిస్తామని ముడుపులు కట్టడం వల్ల పిల్లలను ఆ తల్లి చల్లని చూపుతో రక్షించేది. ఎల్లమ్మ తల్లి కి ఆదివారం, మంగళవారం, గురువారం ఎంతో ఇష్టం.ముడుపులు కూడా భక్తులు ఈ వారాలే చెల్లిస్తారు.

ఇష్టమైన రంగులు:ఎరుపు, పసుపు

ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు

ఇష్టమైన పూజలు: కొత్త కుండకి పసుపు,కుంకుమ తో అలంకరించి,దానిలో చద్ది నైవేద్యం పెట్టి, వేప మండలతో కుండని అలంకరించి దాని మీద దీపాలంకరణ చేసి మేళతాళాలతో అమ్మవారికి సమర్పించుకోవటం.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పూలు, పండ్లు,చద్ది ప్రసాదం.
చద్ది నైవేద్యం తయారి:అన్నం పెరుగుతో కలపడమే.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment