చాలా మంది పిల్లల కోసం బంగారం రూపంలో పొదుపు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న గొలుసులు ,ఉంగరాలు కొంటారు. బంగారం రూపంలో పొదుపు చేయాలనుకొంటే ఆర్ బి ఐ మూడు నెలలకోసారి ఇష్యూ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనవచ్చు. వీటిని ఐదు లేదా ఎనిమిదేళ్ళ నిలువ ఉంచుకోవచ్చు. గడువు కాలం పూర్తయ్యాక అప్పుడు బంగారం ధర ఎంత ఉంటదో అంత ఇచ్చేస్తారు. పోస్టాఫీస్, జాతీయ బ్యాంక్ లు ,ప్రైవేట్ బ్యాంక్ ల్లో ఈ బాండ్స్ దొరుకుతాయి. రిస్క్ ఏమీ ఉండదు. పైగా ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అమ్మేయవచ్చు. అయితే ఈ బంగారంపై పెట్టుబడి వల్ల చాలా తక్కువ రిటర్న్స్ వస్తాయి కనుక బాగా ఆలోచించి ఈపెట్టుబడికి వెళ్ళవచ్చు.

Leave a comment