భారతీయ సంస్కృతిలో బంగారానికి ఎంతో విలువ ఉంది. అందుకే భారతీయుల జీవితంలో కీలక ఘట్టాలన్నింటిలో బంగారానికి సంబంధం ఉంది. పసి బిడ్డకు చెవులు కుట్టించి బంగారు పోగులు పెడతారు. నామకరణం నాడు బంగారు ఉంగరతో పేరు రాస్తారు. అన్నప్రాసన రోజు బంగారు వస్తువుతోనే తొలి తీప రుచి చూపిస్తారు.పాకే సమయంలో పిల్లల ముందు బంగారు వస్తువు పెట్టి వాళ్ళ భవిష్యత్ ఊహిస్తారు.బంగారు లోహ లక్షణాలను అర్దం చేసుకుని దాన్ని నగలుగా మర్చుకున్న దేశం అది.బంగారపు విలువ అధికమవుతుంది.2017 వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారు వేసిన అంచనా ప్రకారం ప్రపంచంలో నేటికి 1 లక్షా 87 వేల 200 మెట్రిక్ టన్నుల బంగారం వెలికి తీశారు. ఇక బంగారం దొరకడం కూడా కష్టమే. అందుకే బంగారం విలువ పెరుగుతుంది కాని తరిగిపోదు.

Leave a comment