సరదా వుండాలే కానీ బోలెడన్ని వస్తువులున్నాయి  మార్కెట్ లో. ఒక గోళ్ళ విషయం తీసుకోండి. స్ప్రే ఆన్ నెయిల్ పాలిష్ తీసుకుంటే దాన్ని పది పదిహేను సెంటీమీటర్ల దూరం నుంచి చేతి పైన స్ప్రే చేస్తే గోరంతా పరుచుకుంటుంది. మిగతా చేతిపై పడ్డ పాలిష్ ను నీళ్లతో కడిగేస్తే పోతుంది. గోళ్ళ పైన రంగు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉండాల్సిందే. నెయిల్  పెయింట్ క్లీనప్ పెన్ తీసుకుంటే గోళ్ళ రంగు వేసుకునేటప్పుడు చర్మానికి అతుకున్న రంగుని ఈ పెన్ లో వున్న నెయిల్ పాలిష్ రిమూవర్ లు గొఱుకు తగలకుండా తుడిచేయచ్చు. ఇప్పుడు కలర్ చేంజ్ నెయిల్ పాలిష్ తీసుకోండి. ఈ గోళ్ళ రంగు వేసుకుని నీటిలో వుంటే ఒక రంగులో వుంటుంది. ఎండ గానీ వేడి కానీ  తగిలితే వేరే రంగంలోకి మారిపోతుంది. అంటే దానంతట అదే రంగు మారిపోతుంది. అంటే నెయిల్  పాలిష్ స్ట్రిప్స్ తీసుకుంటే అవి వివిధ డిజైన్లతో ఎన్నెన్నో రంగుల్లో వుంటాయి. మనకి నచ్చిన రంగు సైజు తీసుకుని గోరుకు అంటించుకోవటమే ఎలాగంటే స్ట్రిప్ పైన ప్లాస్టిక్ కవర్ వుంటుంది. అది లాగేసి గోరుకు  అంటించుకుంటే డిజైన్ లాగా రంగు గోరుకు  అంటుకుంటుంది. డిజైన్ లాగా రంగు గోరుకు  అంటుకుంటుంది. వీలికేమైనా అంటితే క్లీనప్ పెన్ తో తుడిచేస్తే సరి. ఈ వస్తువులన్నీ నెట్ లో సెర్చ్ చేసి ఆన్ లైన్ లో కొనుకోవచ్చు.

Leave a comment