Categories
నిరంతరం నీళ్ళతోనే పనిచేయటం తో గోళ్ళు బలహీనపడతాయి. అలాగే శానిటైజర్స్ ఉపయోగిస్తే కూడా వీటిలోని ఆల్కహాల్ గోళ్లను బలహీనపరుస్తుంది. గోళ్ళను ప్రతిరోజు కొబ్బరినూనెతో మృదువుగా మర్దన చేయాలి రెండు రోజులకొకసారి నిమ్మచెక్కతో గోళ్లు చుట్టూ మర్దనా చేస్తే ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. అలాగే గోళ్ళకు క్యూటీ కాల్ ఆయిల్ రాస్తే వాటి చుట్టూ ఉండే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గోళ్ళ చుట్టూ కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మంచి నెయిల్ పాలిష్ ఎంచుకుని ముందుగా బేస్ వేసి ఆ తర్వాత పాలిష్ వేస్తే నెయిల్ పాలిష్ లోని రసాయనం గోళ్ళను పాడు చేయకుండా ఉంటుంది.