తోటి కళాకారిణి మర్సకొల కళావతి తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారం తో సత్కరించింది. అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన కళావతి గోండు రాజులు కొలాముల ఇళ్లలోని పెండ్లి, చావు, పూజ వంటి అన్ని సందర్భాలలోనూ పాటలు పాడే వృత్తి మారుమూల ఆదివాసీల పాటలను అదే చదువు లాగా నేర్చుకుంది. గోండు రాజులు కోల మూల చరిత్ర ఆదివాసి సంస్కృతికి ఆధారం వాటికి లిపి లేదు. అలాగే గోండు కులం లోని నాలుగు తరాల గోత్రాలతో వారి కథలను కలిపి ఆలపించటం కళావతి ప్రత్యేకత యూట్యూబ్ లో కళావతి పేరుతో ఆ గోండుల పురాణాలు గాధలు వినచ్చు. వందల వీర గాధల్ని ఆలపించే కళావతి ని విశిష్ట మహిళా పురస్కారం దక్కింది.

Leave a comment