గొంతునొప్పి , దగ్గు కఫము వంటి సమస్యలు రావటం సహజం .ఇది కంగారు పడవలసిన సమస్య కాదు .గోరువెచ్చని నీరు తాగాలి ఆహారంలో మిరియాలు అల్లం , శొంఠి , పసుపు ఎక్కువ వాడాలి.రెండు కప్పు ల నీళ్ళలోకి కరక్కయ్య ముక్కలు వేసి మరిగాక ఆ నీటితో పుక్కిలిస్తే మంచిది .చెంచా వాము కి రెండు కప్పుల నీళ్ళుక్ చేర్చి ఆ నీటినిన్ మరిగించి పుక్కిలించినా సరే .అలాగే నీళ్ళలో మెంతులు వేసి బాగా మరిగించి ఆనీటిని పుక్కిలించినా గొంతునొప్పి తగ్గుతోంది .గోరు వెచ్చని మిరియాల కాషాయం లో కొద్దిగా తేనే కలిపి గొంతుకు తగిలేలా నెమ్మదిగా మింగాలి తులసి ఆకుల రసంలో తేనే కలిపి తీసుకొన్నా మంచిదే .

Leave a comment