తల్లి పాలలో బిడ్డలకు అనేక జీవ రసాయన చర్యలను ప్రేరేపించే ఎంజైములు,హార్మోన్లు పెరుగుదలకు తోడ్పడే అంశాలు ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు ఎంతో ఆరోగ్యం,డయాబెటిస్ వంటివి కొన్ని ఆలస్యం అవుతాయి కూడా . పాలిచ్చే తల్లులు ఎక్కువగా నీళ్ళు తాగాలి. ఐరన్ ఎక్కువగా ఉండేందుకు బిన్స్,వేరుశనగ అలసందలు తృణ ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లు స్ట్రా బెర్రీస్ వంటివి తినాలి ప్రోటీన్లు పుష్కలంగా ఉండేందుకు గుడ్లు,పాలు పాల ఉత్పాదనలు బఠానీ,నట్స్ వంటివి తీసుకోవాలి . ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు సోయామిల్క్ పెరుగు వంటి ఆహార పదార్ధాలు పుష్కలంగా తీసుకోవాలి.

Leave a comment