కొన్ని రకాల నూనెలతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు  ఎక్సపర్ట్స్ .ఒక పెద్ద కలబంద ఆకు ను నిలువునా చీల్చాలి గుప్పెడు మెంతులను చీల్చిన ఆకు మధ్యలో పోయాలి.ఆ తరువాత  ఆకుల్ని యధావిధిగా మడిచి దారంతో విడిపోకుండా కట్టి ఒక రోజంతా వుంచాలి మరుసటి రోజు ఆ గుజ్జుని మెంతులను కలిపి మెత్తగా మిక్సీలో రుబ్బాలి.ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపి ముదురు రంగు వచ్చే వరకు వేడి చేయాలి తరువాత చల్లార్చి సీసాలో భద్రం చేయాలి .ఈ నూనెతో వారానికి ఒకసారి జుట్టుకు పట్టించి మాడుకు మర్దన చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుంది మృదువుగా సిల్క్ లాగా మారుతుంది.

Leave a comment