మనసుండాలి కానీ కొన్ని మంచి పనులు చేసేందుకు మరీ ధనవంతులే అయి వుండక్కర్లేదు. తమిళనాడు లోని పూవ్ ళూర్ ప్రభుత్వ పాఠశాల సైన్స్  మాస్టర్ సతీష్ కుమార్ పాఠశాలకు వెళుతూ దారిలో తమ పాఠశాల పిల్లలు బ్యాంకు బయట నిలబడి సెక్యూరిటీని బతిమిలాడటం చూశాడు. విచారిస్తే ఆ పిల్లలు నెలసరి లో ఉన్నామని పాఠశాలలో మరుగుదొడ్లు లేవని ఈ బ్యాంక్ లో మరుగుదొడ్డి వాడుకుంటామని అడిగితే సెక్యూరిటీ రానివ్వటం లేదు అన్నారు. మనసు కరిగిపోయి తన దగ్గర ఉన్న సొమ్ముతో స్కూల్లో ఉన్న మరుగుదొడ్లు బాగు చేయించారు. ఇంతలో ఓ ప్రైవేట్ సంస్థ ఆయన కు ఉత్తమ టీచర్ అవార్డ్ ఇస్తు 50 వేలు నగదు బహుమతి ఇచ్చింది. మహా ఆనందంతో మాస్టారు ఆ యాభై వేలకు తోడు ఇంకొన్ని విరాళాలు సేకరించి అన్ని వసతులు ఉన్న టాయిలెట్లు కట్టించేశాడు పిల్లలు హాయిగా చదువుకొంటున్నారు.

Leave a comment