అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న అప్నా ఆస్మాన్ దర్శకుడు కౌషిక్ రాయ్,రవి, పద్మినీ ల కొడుకు ఆటిజం ఉన్నట్లు తేల్చారు డాక్టర్లు.  పైగా స్లో లెర్నర్.అబ్బాయి పెంపకం లో ఇద్దరి జీవితం కాస్త ఒడి దుడుకులు పడుతోంది.ప్రత్యేక అవసరాలున్న బిడ్డను పెంచడం కష్టమే కదా. అలాంటి పిల్లవాడికి ఒక డాక్టర్ సలహాతో ఒక ఇంజక్షన్ ఇస్తాడు తండ్రి. పిల్లవాడు చైల్డ్ సూపర్ స్టార్ అవుతాడు ఆటిజం పిల్లవాడు చాలా మేధావి అయిన సందర్భంలో తల్లిదండ్రులు జీవితాల్లో ఏమైంది.చైల్డ్ సూపర్ స్టార్ ను మీడియా ఎలా వాడుకుంటుంది ? విపరీతమైన పాపులారిటీ సంపాదించిన పిల్లవాడు ఏమవుతాడు. సినిమాలో చూడొచ్చు ముఖ్యంగా ఇర్ఫాన్ ఖాన్ కోసం ఈ సినిమా తప్పనిసరిగా చూడండి .

Leave a comment