గాన్ కేశ్ భారతీయ హిందీ భాషా కామెడీ డ్రామా సినిమా ఎంతో బావుంది కాసిమ్ ఖాల్లో రచన :ధీరజ్ ఘోష్ నిర్మించారు . ఒక టీనేజ్ అమ్మాయి చక్కని డాన్సర్ హటాత్తుగా జుట్టు ఉడిపోవటం మొదలవుతుంది . డాక్టర్ దాన్ని అలోపేసియా అనే రుగ్మతగా గుర్తిస్తాడు . మొదట్లో ఈ అనారోగ్యం దాచుకునేందుకు ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతోంది . విగ్ కొంటాడు తండ్రి . మాములు మధ్య తరగతి కుటుంబం అది . అన్ని సంతోషాలు పక్కన పెట్టి అమ్మాయి ఆనారోగ్యంతగ్గించేందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు . చివరకు ఒక డాన్స్ కాంపిటేషన్ లో విగ్ తోనే పాల్గోనేందుకు వస్తుంది . అక్కడ ఆ అమ్మాయి విగ్ పొరపాటున జారిపడుతుంది . ఆ నిముషంలో తాను అనవసరంగా ఈ జుట్టు లేని ముఖాన్ని చూపించేందుకు సిగ్గుపడుతున్నానని అర్థంచేసుకొంటుంది . ఆమెను ప్రేమించిన అబ్బాయి అదివరకే యాక్సెప్ట్ చేశాడు . తన పొరపాటు తెలుసుకొని తననుతాను గుర్తించు కొంటుంది . గుండు తోనే డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటుంది . పెళ్ళి జరుగుతుంది . పెళ్ళయ్యాక డాన్స్ స్కూలు పెట్టుకొంటుంది . పబ్లిక్ లో గుండు తోనే ధమాకా నవ్వుతూ వెళుతుంది ఇదీ కధా . తప్పనిసరిగా చూసి ,స్ఫూర్తి పొందవలసిన సినిమా . ప్రైమ్ లో ఉంది చూడండి .

Leave a comment