ప్రతి రోజు తప్పని సరిగా పసుపు మిరియాల పొడి పాలు తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు.ఈ గోల్డెన్ మిల్క్ శరీరానికి పుష్టిని శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో వేసే కొద్దిపాటి మిరియాలు ఉదర సంబంధిత సమస్యలు రానివ్వవు.జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్ లు రసాయనాలు సులువుగా స్రవించటానికి  సహకరిస్తాయి.జలుబు దగ్గుల నివారణలో సమర్థవంతంగా పని చేస్తాయి.వీటిలోని బ్యాక్టీరియల్ గుణాలతో ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.శ్వాస తీసుకోవడం కష్టంగా, ఛాతీ పట్టేసినట్లు ఉన్నా మిరియాలు ఉపశమనం కలిగిస్తాయి. మిరియాల్లో ఉండే పైపరిన్ అనే పదార్థం మెదడు కణాలను ఉత్తేజపరిచి మెదడును చురుగ్గా ఉంచుతుంది.

Leave a comment