వేర్ మాస్క్ స్టే సేఫ్ ఫిల్మ్ కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ ఫిల్మ్ లో నేను నటించాలని చిరంజీవి గారే నా పేరు సూచించారు. మాస్క్ తప్పకుండా ధరించాలని ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం తీసిన ఈ ఫిల్మ్ కి సామాజిక మాధ్యమాల నుంచి ఎన్నో మెసేజ్ లు ప్రోత్సాహం లభించాయి అంటోంది ఈషా రెబ్బా. ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించారు గాని ఆన్ లాక్ తర్వాత చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్లు తప్ప మిగతా ప్రజలంతా మామూలుగా తిరిగేస్తున్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి మెగాస్టార్ చెపితే సీరియస్ గా తీసుకుంటారు అని నేను నమ్మను.ఇప్పుడు చెపుతున్న చేతులు శానిటైజర్ చేసుకోండి,భౌతిక దూరం పాటించండి ఇవన్నీ చేస్తే కొంత వరకు కోవిడ్ ను నియంత్రించవచ్చు అంటోంది ఈషా రెబ్బా.

Leave a comment