పిల్లలకు కడుపులో ఇన్ ఫెక్షన్ రావటానికి చేతుల్లోకి క్రిములే కారణం అంటూ ఉంటారు . ఆల్కహాల్ ఆధారిత హాండ్ శానిటైజర్ జెల్ ని వాడటం వల్ల ఉదార సంబంధిత ఇన్ ఫెక్షన్లు విస్తరించ కుండా తగ్గించవచ్చని ఇటీవల పరిశోధనల్లో గుర్తించారు . డే కేర్ సెంటర్స్ లోని పిల్లలపై విస్తృత అధ్యయనాలు నిర్వహించారు. బాత్ రూమ్ ,కిచెన్ ,పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరిశీలనలో పిల్లల్లో 60 శాతం తక్కువ ఇన్ ఫెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు . ఆల్కహాల్ ఆధారిత జెల్స్ చర్మంపై గల బాక్టీరియా,ఇతర వైరస్ లను బాగా నశింప జేస్తాయని నిపుణులు చెపుతున్నారు . జెల్ లో 60 శాతం ఆల్కహాల్ ఉండాలని వారు సూచించారు .

Leave a comment