సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ వేసే కరాటీ కళ్యాణి గొప్ప భాగవతారిణి . 136 గంటల పాటు నిర్విరామంగా హరికథ గానం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు చేర్చుకుంది . అష్టోత్తర శత హరికధా గానామృత వైభవం కార్యక్రమానికి శ్రీ కారం చుట్టి వరసగా 108 రోజులపాటు నిర్విరామంగా కథలు చెప్పింది . ఇప్పుడు స్వయంగా హరికథ పాఠశాల నిర్మిస్తోంది . ఆమె అసలు పేరు పడాల కళ్యాణి . కానీ కరాటే లో బ్లాక్ బెల్ట్ సాదించి ,జాతీయ స్థాయి లో స్వర్ణ పథకం సాదించి కరాటే కళ్యాణి అయిపోయింది .