ధువా పేరుతో వచ్చిన ఈ గుల్జార్ కథలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గుల్జార్ కవి ,సినిమా గేయ రచయిత .ఆయన అద్భుతమైన కథలు రాశారు అవన్నీ సామాన్యుల వేతలు .1947 లో భారతదేశ విభజన సంద్భరంలో ఆ నేపథ్యంలో రాసిన కథలు ఇవి. ఉర్ధూలో రాసిన ఈ కథలను సి మృణాళిని అనువాదం చేశారు. ఇతర రాష్ట్రాల ,దేశాల సాహిత్యం చదువుతూ వుంటే మనకు మనుష్యులు ఎక్కడి వారైనా ,వాళ్ళ ఆలోచనలో ఒకేలాగే ఉంటాయని తెలస్తుంది మనకీ. ఇంకెనళ్ళకీ పెద్ద తేడాలేదనిపిస్తుంది. గుల్జార్ కథలు చదువుతుంటే మనుషుల చిరునామా జీవితం అంతే. ఎవరి అనుభవాలు వాళ్ళది కావచ్చు …కానీ దుఃఖంలో సుఖంలో అందరూ ఒకటే. చక్కని కథలు చక్కని అనువాదం ,తప్పకుండా చదవ వలసిన పుస్తకం ఇది.

Leave a comment