రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్-RTPL డైరక్టర్ రమాదేవిపై గవర్నర్ తమిళిసై, సీపీ అంజనీ కుమార్ ప్రశంసలు కురిపించారు. మహిళల కోసం మహిళలే నడుపుతున్న ఏకైక ఛానల్ వనిత టీవీ అని కొనియాడారు… హైదరాబాద్‌ లోని కోఠీ ఉమెన్స్‌ కాలేజీలో నగర పోలీస్‌ శాఖ, షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఆర్టీపీఎల్ డైరక్టర్ రమాదేవిని గారిని సత్కరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ఉంటే అనుకున్నది సాధిస్తారని, సెల్ఫ్ డిఫెన్స్ కోసం విద్యార్ధినులు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆమె సూచించారు… తన కలర్, పొడవు, హెయిర్ స్టైల్‌పై గతంలో కించపరిచే వ్యాఖ్యలు చేసేవాళ్ళని కానీ ఇప్పుడు తాను అదే రూపంలో మీ ముందు గవర్నర్ గా నిలబడి ఉన్నానని తెలిపారు…ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని, లక్ష్యాల్ని సాధించే వరకు విమర్శలను పట్టించుకోవద్దని గవర్నర్ విద్యార్థులకు సూచించారు…
ఇక సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ నగరంలో మహిళా భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందని, అందులో భాగంగానే షీ టీమ్స్‌, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి దారుణాలు జరగకుండా అనుక్షణం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు… ఆర్టీపీఎల్ డైరెక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో నడుస్తున్న వనిత టీవీ మహిళల కోసం ఎంతో చేస్తోందని సీపీ అంజనీకుమార్‌ ప్రశంసించారు…అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల చివర్లో… వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ ఘనంగా సన్మానించారు.

 

Leave a comment