న్యూయార్క్ లో జరిగిన ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2021 లో ఈ ఏడాది థీమ్  అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దిన గౌను ధరించి వార్తల్లో నిలిచింది సుధా రెడ్డి. 15 సంవత్సరాలుగా డిజైనర్ రంగంలో ఉన్న భార్య భర్తలు ఫాల్గుని, షేన్ లు  ఈ గౌన్ ని రూపొందించారు. ఫాల్గుని, షేన్ పీకాక్ డిజైన్లు ముఖ్యంగా నూతన వధూవరులు కలెక్షన్. అమెరికా జెండాలోని రంగుల తో డిజైన్ చేసిన సుధా రెడ్డి ధరించిన గౌను ప్రశంసలు పొందింది. మన దేశ సంస్కృతిక ఘనతే మా డిజైన్ లకు ప్రేరణ అంటారు ఈ జంట.

Leave a comment