ఇంతటి ధైర్యం తెగువ అంకితభావం భారతీయ మహిళల లోనే ఉంటాయి. అసలైన భారతీయ మహిళకు ప్రతీక  గౌరీ మహాదిక్ అన్నారు  స్మృతి ఇరానీ. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అమర సైనిక వీరులను తలచుకునే నేపథ్యంలో ఆమె గౌరీ మహాదిక్ లక్ష్యాన్ని ప్రశంశించారు. 2017 భారత చైనా సరిహద్దుల్లో మేజర్ ప్రసాద్ మహాదిక్ గాయపడి ప్రాణాలు వదిలారు. మేజర్ అమరుడైన 10 రోజులకు ఆయన భార్య గౌరీ ఒక నిర్ణయం తీసుకుంది. వృత్తి రీత్యా ఆమె లాయర్ భర్త మరణం తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి లెఫ్టినెంట్  హోదాలో రక్షణ రంగంలో చేరింది.  మేజర్ ప్రసాద్ గణేష్ 2012  లో ఆర్మీ లో చేరాడు గౌరీ ప్రసాద్ ల పెళ్లి 2015లో జరిగింది భర్త ఆశయ సాధన కు కొనసాగిస్తున్న గౌరీ  మహాదిక్ అభినందనలు తెలిపారు స్మృతి ఇరానీ.

Leave a comment