“అమ్మాబైయెల్లి నాదో….తల్లీబైయెల్లి     నాదో”!!

సఖులు!! మరి ఆషాఢ మాసం వచ్చేసింది కదా..గోరింటాకు పెట్టుకోవాలి, కొత్తగా పెళ్లయిన పెళ్లికూతురు పుట్టింటికి వెళ్ళాలి.గ్రామదేవతలకి పూజలు చేయ్యాలి.బోనం ఎత్తాలి.హడావిడిగా వుంటాము కదా!!
ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి రకరకాల కారణాలతో ఆరోగ్యానికి హానికరం కాబట్టి అనాదిగా వస్తున్న ఆచారం ఈ గ్రామదేవతల పూజలు. 101అవతారాలలో అమ్మవారు మనకు ఈ ఆషాఢ మాసంలో దర్శనం ఇస్తారు.హైదరాబాదు,సీకిందరాబాదు ప్రాంత వాసులు చద్ది నైవేద్యం పెట్టు
కుంటారు.
ఆషాఢమాస అమ్మవార్లకి ఒక సోదరుడు,పేరు పోతురాజు.అక్క చెళ్ళెళ్ళ సంరక్షణ ఆయనదేనండోయ్!!

   ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందం.

    ఇష్టమైన అవతారం: శాకాంబరి అవతారం.

     నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు.

 

-తోలేటి వెంకట శిరీష

 

Leave a comment