ఇంగ్లాడ్ కు చెందిన క్రిస్టినా నర్స్ గా రిటైర్ అయ్యాక తనకు వచ్చిన 45 లక్షల రూపాయిలను హైపర్ రియలిస్టిక్ బొమ్మల పైన ఖర్చు పెట్టేసింది . 68 ఏళ్ళ క్రిస్టినా కు బొమ్మలంటే విపరీతమైన ఇష్టం అవి చూసేందుకు అచ్చం పిల్లల్లా కనిపించే హైపర్  రియలిస్టిక్ డాల్స్ . రోజు వాటికి స్నానం చేయించటం కొత్త బట్టలు తొడగటం షికారు తిప్పటం చేస్తుంది . ఈ బొమ్మలే ఆమె ప్రపంచం . ఆమె భర్త ఈమె ఇష్టాన్ని గౌరవించి సరే అంటున్నారు. సొంత పిల్లలకు పెద్దగా నచ్చదు కానీ ఈ బామ్మగారికి ఈ బొమ్మల సంరక్షణే ఇప్పుడు కాలక్షేపం .

Leave a comment