ఇన్ఫోసిస్ మూల స్తంభాలలో ఒకరైన సుధా మూర్తి రాసిన గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ బుక్ రాబోతోంది.లాక్ డౌన్ లో పిల్లల కథలు రాయటం మొదలుపెట్టి మొత్తం 20 కథలు రాశారు.అడవులు, సరోవరాలు, వింతలు, విడ్డూరాలు ఉండే ఈ కథలు అమ్మమ్మ తాతయ్యలు చెప్పే కథల్లాగా ఉంటాయి.ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ప్రచురిస్తోంది.రచనా రంగంలో కూడా ఎంతో కృషి చేశారు సుధా మూర్తి.ఇంగ్లీష్ లో పాతిక పుస్తకాలు కన్నడం లో పదిహేను పుస్తకాలు వెలువరించారు.అవి ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తృతంగా అనువాదం అయ్యాయి.ఇంతకు ముందు గ్రాండ్ మా బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ తీసుకొచ్చారు సుధామూర్తి.

Leave a comment