వేసవి రాగానే మార్కెట్ లో ప్రత్యక్షం అవుతోంది కర్బుజ. ఆరోగ్యానికి మేలుచేసే కర్బుజ లో విటమిన్-సి  అధికం. ఇది తెల్ల కణాలను పెంచటం తో పాటు ప్రీ రాడికల్స్ ను నిరోదించటం ద్వారా వ్యాధులు రానివ్వదు. పీచు అధికంగా ఉండటం తో జీర్ణక్రియ బావుంటుంది. పుష్కలంగా వుండే ఫోలేట్లు  గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండటం తో చర్మం పొడిబార నివ్వదు. ఇందులోని పోషకాలు శరీరం లోని టాక్సిన్ల ను బయటికి పోయేలా చేస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచటం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. తప్పని సరిగా ప్రతి రోజు కర్బుజ తింటే వేసవి తాపానికి విరుగుడు గా ఉంటుంది.

Leave a comment