పూల అలంకరణ కోసం బటన్ మామ్స్ అంటే చిట్టి చామంతులు చాలా బావుంటాయి. అందులోనూ ఆకుపచ్చని చామంతులు మరీ బావుంటాయి త్వరగా వాడిపోవు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ లో ఎంబ్రాయిడరీ చేసినట్లుగా అనిపించేందుకు ఈ ఆకుపచ్చని బటన్ చామంతి ని ఎక్కువగా వాడుతున్నారు. దండ లతోపాటు పెళ్లి వేదిక అలంకరణతో ఇవి చక్కగా విరుస్తున్నాయి. ఇవి తెలుపు, నారింజ, పసుపు, ఎరుపు, ఇలా ఏ రంగు పూల మధ్యలో అయినా అందంగా ఒదిగిపోతాయి. బోకెల్లోనూ వేజుల్లో కూడా ఇవి బావుంటాయి. రోజూ కాసేపు పచ్చదనం చూస్తే కళ్ళు సమస్యలు తగ్గుతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. దేవి దేవతల పూలమాలల్లో వధూవరుల వరమాలల్లో  ఈ పచ్చ చామంతుల అందమే అందం.

Leave a comment