ఈ క్వారంటైన్ సమయంలో సీజనల్ గా దొరికే పండ్లు కూరలు,మసాలాలు విరివిగా వాడటం వల్లనే మన రోగనిరోధక శక్తి ఇతర దేశాలకంటే మెరుగ్గ వుంది అంటున్నారు వైద్యులు. ఇప్పుడు మార్కెట్ లో పచ్చ మామిడి కాయలు విరివిగా లభిస్తున్నాయి. ఇందులో విటమిన్ సి నిమ్మకాయ కన్నా ఆరురెట్లు ఎక్కువ. విటమిన్-ఎ ,పీచు మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఈ పచ్చి మామిడి పండు తో చేసిన పానీయం తాగితే ఎండ దెబ్బ తగలదు అంటున్నారు పచ్చి మామిడికాయ స్టవ్ పైన కాల్చి పై తోలు తీసి ఆ గుజ్జు పంచదార ఉప్పు నీళ్ళు కలిపి బ్లెండ్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. ఈ పానీయం రోజుకు రెండు సార్లు తాగితే ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment