గ్రీన్ టీలో ఉండే ఫాలీఫినాల్స్ అమైనో ఆమ్లాలు విటమిన్ల కారణంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను 80 శాతం నివారిస్తుందని లండన్ కి చెందిన ప్రముఖ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఆకులోని ఔషధాలను నానో పార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్ కణాల పైన ప్రయోగించి చూడగా అవన్ని దాదాపు చనిపోయాయి. తేయాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువని అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు.ఇప్పుడి కొత్త పరిశోధన క్యాన్సర్ మందుల కంటే తేయాకు నుంచి సేకరించిన పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చెబుతున్నారు.ఖర్చు తకువతో వచ్చే ఈ తేయాకు మందు వెంటనే తయారు చేసేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

Leave a comment