ఆకుకూరల్లో శరీరానికి అవసరం అయ్యే ఖనిజాలు , విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి .పాలకూరలో కాల్షియం ఎముకుల సాంద్రత పెంచుతుంది .రోగనిరోధక శక్తి మెరుగు పరుస్తుంది .గోంగూరలో ఐరన్  ఎక్కువ .తోట కూరలో యాంటీ అక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం లభిస్తాయి .చుక్క కూరలో మెగ్నీషియం విటమిన్ -ఎ లభిస్తాయి .బచ్చలిలో విటమిన్ -సి అధికం  .మునగాకులో ఐరన్, కాపర్ ఎక్కువ ఉంటాయి .కొత్తిమీర వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది .మెంతు కూరలో పీచు, పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి .వీటిని పప్పులతో కలిపి వండటం వల్ల పోషకాలు పెరుగుతాయి .

Leave a comment