నాకు ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా చేయాలని ఉంది అంటుంది దీపికా పడుకోణె. పద్మావత్ లో రాణి పద్మావతిగా, బాజీరావు మస్తానీలో మస్తానీగా , చెన్నై ఎక్స్ ప్రెస్ లో మీనా అజ్గుసుందరంగా బాక్సాఫీస్ బ్రేక్ చేసినా ఇంకా నాకు కల మిగిలే ఉందంటుంది దీపిక. సగటు గృహిణి పాత్రలో నటించాలని నాకల. ప్రతికుటుంబంలో గృహిణి పాత్ర కీలకం. భర్త ,పిల్లలు ,అత్తమామలు,తల్లిదండ్రులతో అందరి కలను ఆమె నిజం చేసుకోవటం వెనుక ఆమె కష్టమే ఎంతో ఉంది. దానికోసం జీవితం త్యాగం చేస్తుంది. చివరకు ఆమెకే గుర్తింపు ఉండదు.అలాంటి పాత్ర శక్తి వంతమైన ,స్పూర్తిదాయకమైన భారతీయ మహిళ పాత్ర పోషించాలని వుంది అంటుంది దీపిక. త్వరలో ఆమె కోరిక నిజమై పోవచ్చు కదా!

Leave a comment