జుట్టు రాలటం చాలా సహజం .కాని మాడు పల్చబడిపోతుంటే మాత్రం తప్పని సరిగా శ్రద్ధ అవసరం. చక్కని గృహ చికిత్సలు చాలు .జుట్టు కుదుళ్లు బలంగా అయ్యేందుకు కొబ్బరి ఆలివ్ నూనెలు కలిపి కాస్త వేడి చేసి మాడుకు మసాజ్ చేసుకొని హాట్ ఆయిల్ ట్రీట్ మెంట్ ఇవ్వటం ముఖ్యమైనది .మందరా ,ఉసిరి ,మల్లెపూలు కొబ్బరి నూనెలో వేసి కాచి గోరువేచ్చగా ఉన్నప్పుడు అప్లైయ్ చేస్తే రక్తసరఫరా మెరుగుపడుతుంది.మెంతులు నానబెట్టి రుబ్బి ,కొబ్బరి పాలు కలిపి శిరోజాలకు అప్లైయ్ చేయాలి.పెరుగులో ఎగ్ వైట్ కలిపి హెయిర్ ఫ్యాక్ చేయవచ్చు.బేబీ ఆయిల్ లో కొద్దీ చుక్కలు నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి చివరి వాష్ గా వాడితే జుట్టు మెరుపుతో ఉంటుంది.

Leave a comment