Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా వుంటారో ఎవ్వరికి తెలియదు. కానీ భర్తలు భార్యల పైన చేయిచెసుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. తన ఆధిపత్య ప్రదర్శనకు పురుషుడు స్త్రీ ని లొంగదీసు కుంటాడు. దాన్ని ఇప్పుడు గృహ హింస అంటున్నాం. ఆప్తులకు కూడా చెప్పుకోలేని గృహ హింసకు తోలి సాక్షి ఈ ఫోటో. ఆమె తనకు పరిచయం వున్న ఒక జంట ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భర్త భార్య పైన స్నానాల గదిలో దాడి చేయడం చుసిన డోనా గబగబా హింసను క్లిక్ చేసింది. ఇదే గృహ హింస తోలి చిత్రీకరణ కానీ ఏ పత్రికల వాళ్ళు వేసుకోలేదు.1991 లో ఫోటో తీసిన 11 ఏళ్ళ తర్వాత తనే సొంతంగా తన ఫోటోలను పుస్తక రూపం లో తెచ్చింది డోనా. ఇక ఆ తర్వాత ఎన్ని వేల గృహ హింస సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయో లెక్కలు చెప్పలేము.

Leave a comment