జలుబు, తుమ్ములు వేధిస్తూ వుంటే ఇంటి వైద్యం ట్రై చేయమంటారు పెద్దవాళ్ళు. ఈ చల్లని వాతావరణం లో ఎంత శ్రద్దగా వున్నా జలుబు చేయకుండా ఉండు గుప్పెడు తులసి ఆకులు, పది మిరియాలు మెత్తగ్గా దంచి మాత్రల్లా చేసి రోజుకు మూడు చొప్పున తీసుకుంటే జలుబు పరారవ్వుతుంది. ఏడు కర్పూర లిల్లీ ఆకులు, పది మిరియాలు తీసుకుని దంచి మాత్రల్లా వేసుకున్నా జలుబు తగ్గుతుంది. నాలుగు టీ స్పూన్ల అల్లం రసం నాలుగు టీ స్పూన్ల తేనె, రెండు టీ స్పూన్ల నిమ్మరసం పావు కప్పు నీళ్ళలో కలిపి రోజు మొత్తం మీద సిప్ చేస్తే జలుబు దగ్గు రెండు పోతాయి రిలాక్సేషన్ కోసం అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, యాలుకలు, తేనె కలిపిన వేడి వేడి టీ తాగితే మంచి ఫలితం వుంటుంది.

Leave a comment