Categories
Soyagam

గులాబీపూల పొడితో ఫేస్ పాక్స్.

ఈ రోజుల్లో అందం కోసం ఆరోగ్యం కొసం ఎవరైనా ప్రకృతి సహజమైన వస్తువుల పైనే ఆధారపడుతున్నారు. ఒక పువ్వు లోనో, పండు లోనో ఒక మంచి లక్షణం వుంటే అది ఎవరికైనా ఒకేలాగా ఉపయోగ పడుతుంది. ఏ టైప్ చర్మం, ఏ మనిషికి తెలుపా, ఎరుపా, అని తేడా లేకుండా ఎవరికైనా ఒకలాగే పని చేసే ఎన్నో వస్తువులున్నాయి ప్రకృతిలో. ఉదాహరణకు గులాబీపూలు. ఈ పూల పొడిని చర్మ సౌందర్య కోసం ఎవరేనా వాడుకోవచ్చు. ఎర్రని రంగులో ఈ గులాబీపూల పొడిని కొంచెం నిమ్మరసం, గంధపు పొడి తో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎవరి చర్మం అయినా గ్లో తో వుంటుంది. అలాగే అలోవీరా గులాబీ రేకుల పొడి గుజ్జుగా చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎలాంటి మచ్చలైనా పోతాయి అలాగే గులాబీపూల పొడిని తేనెలో కలిపి, గంధం పొడి,వ్వుల పొడి కలిపి ఓట్ మీల పొడిని పువ్వుల  పొడిని కలిపి ఇలా కాంబినేషన్ తో గులాబీపూల పొడి కలిపి ఫేస్  ప్యాక్ వేసుకున్న చర్మం మచ్చలు మరకలు లేకుండా పోవడం ఖాయం అంటున్నారు    వైద్యు లు. పైగా ఇవి ఏ సైడ్ ఎఫెక్ట్ లేనివే గనుక నష్టం లేదు.

Leave a comment