గులాబీల అందం గురించి ప్రెత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచం లో సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఏదో ఒక్క చోట గులాబీల బుగ్గలు లేత గులాబీ శరీర వర్ణం ఇవన్నీ పోలిక . ఆ గులాబీ రేకులతో మొహం మెరిసేలా చేయవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్. గులాబీ రేకులు మొహానికి మెరుపేకాదు తాజాదనం కూడా ఇస్తాయి. గులాబీ రేకులు ముద్ద చేసి , చెంచా తేనె కలిపి మొహానికి ఫేస్ పాక్ లాగా వేస్తే సరి. ఓ అరగంట ఆరిపోయాక కడిగేస్తే మొహం మెరుపులే. పెసర పిండిలో కాసిన్ని పాలు , తేనె , గులాబీ రేకుల గుజ్జు కలిపి మొహానికి రాసుకుని ఐదు నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసుకుంటే మొహం కాంతి వంతం గా మెరిసిపోతుంది.

Leave a comment