గుండెలో నొప్పి వచ్చినపుడు ఆ వ్యక్తి చేయవలసిన మొదటి పనులు.

వెంటనే పక్కనున్న వారికి ఆ విషయాన్ని తెలియజేయటం.
వారి సహాయంతో దగ్గరున్న ఆసుపత్రికి వెళ్ళటం.

నొప్పి కొద్దిగానే ఉందని ఎవరికీ చెప్పకుండా వాళ్ళంతకు వాళ్ళే డ్రైవ్ చేస్తూ వెళ్ళటం లేదా నడుస్తూ వెళ్ళటం మంచిది కాదు….

“నాకేమీ కాదు” అని కాన్ఫిడెన్స్ తో ఉండటం ఎప్పటికీ మంచిదే…కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. మీకు మీరే ఒంటరిగా హీరోయిక్ నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పక్కనున్న వారి సహాయాన్ని వెంటనే తీసుకుని వీలైనంత త్వరగా హాస్పిటల్ కు చేరగలిగితే….100% మీకు ఏమీ కాదు.

——-

పక్కనున్న వారు చేయవలసినది ఏమిటి ?

బంధువు కావచ్చు లేదా స్నేహితుడు కావచ్చు, గుండెలో నొప్పి వస్తుంది అని చెప్పగానే దానిని లైట్ తీసుకోమని సలహాలు ఇవ్వకూడదు. “నాకు కూడా మొన్న ఇలాగే వచ్చింది, ఇనో తాగితే తగ్గి పోయింది” అనో…” నీకెందుకు వొస్తుంది, ఏదో గ్యాస్ ట్రబుల్ అయ్యుంటుందిలే” అనో తెలియకుండా జడ్జ్మెంట్ లు చేయకూడదు. (మనదేశంలో అతి ఎక్కువ మరణాలు పక్కనున్న వాళ్ళ తప్పుడు సలహాలవలననే జరుగుతుంటాయి… ఎందుకంటే సలహా ఇవ్వటం చాలా సులువు మనదేశంలో..)

ఐతే వాళ్ళకు ధైర్యం చెప్పవచ్చు.ముఖ్యంగా పక్కనున్న మీరు టెన్షన్ పడకుండా ఉండాలి. ఒకవైపు ధైర్యం చెబుతూ..మరో వైపు అలెర్ట్ గా హాస్పిటల్ చేరే విషయంలో చొరవ చూపాలి.

పక్కనున్న వాళ్ళు, నొప్పి వచ్చిన వ్యక్తిని వీలైనంత వరకూ నడిపించకుండా అతడిని హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాలి. టూ వీలర్ పైన కంటే 108 లేదా అంబులెన్సు సహాయంతో తీసుకు వెళ్ళాలి. చెమటలు విపరీతంగా పట్టి, ఆ వ్యక్తి శ్వాస తీసుకోవటానికి కూడా కష్ట పడుతున్నట్టైతే.. ambulance లో మాత్రమే తీసుకు వెళ్ళాలి. 108 సర్వీసులు ఎపుడు ఫోన్ చేసినా ఐదు నిమిషాల వ్యవధిలో వచ్చేస్తాయి. ఈ లోగా కారు, ఆటో వంటి ఇతర వాహనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. గుండెలో నొప్పి ఉన్నప్పుడు అంబులెన్సు లో పడుకోబెట్టి తీసుకెళ్ళే బదులు కూర్చోబెట్టి తీసుకెళ్ళటం సరైనది. కొన్ని అంబులెన్సు లలో ఆక్సిజన్ కూడా ఉంటుంది. వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ పెడితే నిర్భయంగా పెట్టించుకుని రిలాక్స్ అవ్వాలి.

హాస్పిటల్ కి వెళ్ళాక కార్డియాలజిస్టు కన్సల్టేషన్ కావాలి అని అడుగుతూ రిసెప్షన్ లో టైం వేస్ట్ చేయకూడదు. పేషెంట్ తో మెట్లు ఎక్కించటం వంటివి చేయకూడదు. పేషెంట్ ను డైరెక్ట్ గా emergency department కి తీసుకుపోవాలి. అవెప్పుడూ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటాయి. Emergency department లో well trained emergency medicine doctors ఉంటారు. వాళ్ళు వెంటనే ecg తీయటమూ, ఒకవేళ ecg లో మార్పులు ఉంటే( అంటే నార్మల్ ఇసీజీకి భిన్నంగా ఉండటం) అక్కడికే గుండె డాక్టర్ ను పిలిపించి చూపించటమూ జరుగుతుంది.

తరువాతి పోస్ట్ లో హాస్పిటల్ కి చేరే ముందు వేసుకోవాల్సిన మందుల గురించి తెలుసుకుందాం.
డా. విరివింటి విరించి (కార్డియాలజిస్ట్)
+91 99486 16191

Leave a comment