ఛాతి నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళగానే..అక్కడ డాక్టర్లు మొదట చేసే పని ecg చేయటం. ఈసీజీ తీస్తూ హిస్టరీ తీసుకోవటం జరుగుతుంది.

ఈసీజీలో ఉన్న తేడాలను బట్టి heart attack జబ్బును మూడు రకాలుగా విభజించుకుంటారు.

1.Unstable Angina without ECG changes.
వీళ్ళకు ఈసీజీ నార్మల్ గా ఉంటుంది.

2.Unstable Angina with ECG changes.
వీళ్ళకు ఈసీజీ లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి.

3.Acute coronary Syndrome.
వీళ్ళకు ఈసీజీ లో మేజర్ మార్పులు ఉంటాయి. అంటే ఇదే మేజర్ హార్ట్ ఎటాక్. ఇందులో ECG మార్పులు దృష్ట్యా NSTEMI అనీ..STEMI అనీ రెండు రకాలు.

3 వ రకం వాళ్ళను వెంటనే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాపాయం. 2 వ రకం వాళ్ళను observation లో ఉంచవచ్చు 1 లేదా 2 రోజులు. ఎందుకంటే చిన్న చిన్నగా మొదలైన ఈసీజీ మార్పులు 3వ రకంగా మారే అవకాశం ఉంటుంది కొంతమందిలో. అందుకనే observation లో ఉంచి ఈసీజీ మానిటరింగ్ చేస్తారు. ఇక ఒకటవ రకం వాళ్ళు బహుశా గ్యాస్ ట్రబుల్ లేదా యాంక్జైటీ వలన వచ్చి ఉండింటారు‌. వారిని కొంతసేపు observe చేసి పంపించవచ్చు.

ఐతే ఒకటో రకం వాళ్ళు రెండో రకం వాళ్ళలో కనుక blood pressure , diabetes, smoking వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే రిస్క్ ఎసెస్మెంట్ కోసం ఇంకొన్ని పరీక్ష లు చేయటం జరుగుతుంది. ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా ట్రీట్మెంట్ కొనసాగుతుంది.

3 వ రకం లోని ,NSTEMI, STEMI మార్పులుగల పేషంట్లను వెంటనే iccu లోకి మార్చి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలవుతుంది.

Ecg తో పాటు చేసే అదనపు పరీక్షలు జబ్బు తీవ్రతను చెప్పటానికి , ట్రీట్మెంట్ ని ప్లాన్ చేసుకోవటానికీ ఉపయోగపడతాయి. అవేంటో తర్వాత పోస్టుల్లో.

Leave a comment