మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి పరిశోధన సారాంశం ఏమిటంటే గుడ్డు తినడం గుండెకు మంచిదే అంటున్నారు పరిశోధకులు. అధిక క్వాలిటీ ప్రోటీన్లున్న గుడ్డు తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య తగ్గుతుందంటున్నారు. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్లుంటాయి. విటమిన్ A, D, E లతో పాటు యాంటి ఆక్సిడెంట్లు వుంటాయి. వీటిలోని ప్రోటీన్లు బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు అవిశలు, గ్రీన్ టీ, గుడ్డు, పెరుగు, పాలు నిత్యం తీసుకోమంటున్నారు.

Leave a comment