కార్గిల్ గ‌ర్ల్‌ గా పరిచితురాలైన గుంజన్ సక్సేనా పేరు 20 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గుంజన్ పాత్రలో నటించిన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గ‌ర్ల్‌ చిత్రం త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవ్ గుంజన్ సొంత ఊరు. 1994 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక చేసిన 25 మంది మహిళా పైలెట్ లలో గుంజన్ హెలీకాఫ్టర్ లో చేస్ క్యాంప్ నుంచి సైనిక స్థావరాలకు ఆహారం ఔషధాలు అందించేది గాయపడిన సైనికులను చేస్ క్యాంప్ కు తరలించేది. యుద్ధ భూమిలో హెలికాఫ్టర్ నడిపిన తోలి మహిళా పైలట్‌ గా రికార్డ్ సాధించింది. ఆమెను షౌర్య చక్ర తో సత్కరించింది ప్రభుత్వం.

Leave a comment