ఎంతో మంది నిద్రలో గురక పెడతారు . గురక తీరు శబ్దం ఒకటిగా లేకపోవచ్చు . కానీ ఆ గురక ఎందుకు వస్తోంది . తెలుసుకునే మార్గం లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి . ముక్కతో గాలి పిల్చుతారు . కానీ గురక సమయంలో నోటితో గాలి పీల్చి వదలటం వల్ల పలు రకాల ,రసాయనాలు,సూక్ష్మజీవులు నేరుగా ఊపిరి తిత్తుల్లోకి చేరతాయి . అలాటివి వడకట్టే సౌకర్యం ముక్కులో ఉంటుంది . కానీ నోటిలో ఉండదు . గురక తీవ్రం అవుతుందీ అంటే స్లీప్ అప్నియా కూడా ఉందనుకోవచ్చు . అంటే కొన్ని సెకెన్ల పాటు శ్వాస క్రియ అగుతోంది . ఈ లోగా మెలుకువ వస్తుంది . ఇది గుండె పైన వత్తిడి పెంచుతుంది . రాత్రి వేళ నిద్ర చెడుతుంది . పడుకొనే ముందు మంచినీళ్ళు బాగా తాగాలి . ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రకు ఉపక్రమించాలి .

Leave a comment