అన్ని విధాలా అధ్బుతమే అని చెప్పుకొంటారు కానీ వ్యాయమాలు వర్కవుట్స్ అలసట తెప్పిస్తాయి. ఎప్పుడు బ్రేక్ పడుతోనే ఉంటుంది. అయితే సంగీతం వింటూ వర్కవుట్స్ చేస్తుంటే అలసట తెలియకుండా లక్ష్యం సాధించేందుకు వీలవుతోంది. వర్కవుట్ మ్యూజిక్ శారీరకంగా అలసట నుంచి దృష్టి మరల్చి పూర్తిస్థాయి పెర్ఫార్మెన్స్ ను 20 శాతం వరకు పెంచుతోందని అధ్యయనాలు గుర్తించాయి. సంగీతం నొప్పుల మీదకు దృష్టి పోనివ్వదు. హై బీట్స్ , ఫాస్ట్ టెంపో మ్యూజిక్ మరింత ప్రభావం చూపిస్తుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. ఇక హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ అయితే రాక్ మ్యూజిక్, నెమ్మదిగా చేసే మోడరేట్ వ్యాయమాలతో పాప్ మ్యూజిక్, జాగర్లకు హిప్-హప్ కరెక్ట్ గా ఉత్సహం ఇస్తాయని ఎక్స్ ఫర్ట్స్ అభిప్రాయపడ్డారు.

Leave a comment