హై హీల్స్ సమస్యలు వచ్చేందుకు వయసుతో సంబంధం లేదు అంటున్నారు డాక్టర్లు. 20, 30 సంవత్సరాల వయసు వారిలో ఈ మధ్య కాలంలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్ట్. సమస్య మొదలైనప్పుడే శరీరం సిగ్నల్స్ ఇస్తూ వుంటుంది. వేళ్ళల్లో, పాదం =మధ్యలో, మడమ, మోకాలు, పిరుదులు, వెన్నులో నొప్పులు, ఒక్కోసారి తలనొప్పి వంటి లక్షణాలు హై హీల్స్ ఎంచుకోవడం వల్ల మొదలవుతున్నాయి. కానీ ఫ్యాషన్ పోకడలో హై హీల్స్ ఎప్పుడూ ముందుంటాయి. ఆరోగ్యం విషయంలోనూ ఇవి ముందే. రెగ్యులర్ గా హై హీల్స్ ధరించడం వల్ల స్లిప్డ్ డిస్క్, మోకాలి ఆర్ద్రరైటెస్, పాదంలో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తాయి. వేగంగా నడిచినా, పరుగు తీసినా సరయిన కదలిక కోసం మోకలపై ఎక్కువ భారం పడుతుంది. ఈ పాయింటెడ్ షూస్ వల్ల మోకాల్లలోని కార్డిలేజ్ ప్రభావితం అవుతుంది. ఒకటి అరా ప్రత్యేక సందర్భాలలో తప్ప హై హీల్స్ రెగ్యులర్ గా మాత్రం ధరించవద్దని డాక్టర్లు హితవు చెపుతున్నారు.

Leave a comment