జుట్టు రాలే సమస్యకు రసాయనాలు లేని సహజమైన హెయిర్ మాస్క్ వాడటం మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. కర్పూరం కలిపిన కొబ్బరినూనెను తలకు పట్టించి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల తేనె రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి కలిపి ఆ పేస్ట్ ను తలకు పట్టించాలి. ఈ మాస్క్ కూడా జుట్టు రాలటం తగ్గిస్తుంది. అవకాడో ముక్కలు మెత్తగా చేసి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఆ పేస్ట్ ను తలకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

Leave a comment