ఈ వాతావరణంలో శిరోజాలకు ఎక్కువగా హాని కలుగుతుంది . జుట్టు తడితడి గా ఎప్పుడూ బయటకు వెళ్ళకూడదు . వాతావరణంలోని చల్లదనానికి శిరోజాలు ఫ్రీజ్ అయినట్లు అయి పోయి తెగిపోతాయి . గోరువెచ్చని,లేదా చల్లని నీటి స్నానమే మంచిది . వేడినీరు మాడును పొడిబారేలా చేసి శిరోజాలకు చర్మానికి హాని కలిగిస్తాయి . డ్రై షాంపూ చేసుకోవచ్చు అంటే బేబీ పౌడర్ ను సింపుల్ గా జుట్టుపై చల్లి దువ్వెనతో దువ్వెయాలి శిరోజాల స్టయిలింగ్ కోసం బ్లో డ్రై యర్లు కర్లింగ్ ఐరన్ లు వంటి వేడి పరికరాలను పరిమితం చేసుకోవాలి . ఒకవేళ ఈ పరికరాలు వాడవలసి వచ్చినపుడు శిరోజాలపై లివ్ ఇన్ కండిషన్ ఉపయోగించాలి . చలగాలిలో బయటకి వెళితే స్కార్ఫ్ ధరించాలి .

Leave a comment