చాలామంది తలకు నూనె రాసుకోవటం ఇష్టం ఉండదు.దానితో జుట్టు పొడిబారిపోతుంది తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె ఆముదం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు రాసుకోవాలి.వేళ్ళతో మర్దన చేయాలి. జుట్టు కావలసిన తేమ అంది చివరలు చిట్లిపోకుండా ఉంటాయి.అలాగే జుట్టుకు హెన్నా లేదా ఇతర హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు గంట తర్వాత వాటిని పూర్తిగా శుభ్రంగా కడిగి వేయాలి. తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు తడిగా ఉన్నప్పుడే కండిషనర్ రాసుకుంటే జుట్టు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment