ఎండ వేడికి  వెంట్రుకలు నిర్జీవంగా అయిపోతాయి అలాటప్పుడు కొబ్బరిపాలతో జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. పావు కప్పు పచ్చి కొబ్బరి పాలు అరటిపండు స్పూన్ ఆముదం కలిపి మెత్తని పేస్టులాగా చేసి ఆ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఓ అరగంట అలా ఉంచి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా జుట్టు రాలకుండా ఉంటుంది. కొన్ని కొబ్బరి పాలు గుడ్డులో తెల్లసొన చంచా నిమ్మరసం కలిపి తలకు ప్యాక్ వేసుకోవాలి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మెరుపును సంతరించుకుంటుంది. జుట్టు పట్టు లాగా  మారిపోతుంది.

Leave a comment