సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు హలీమా యాకోబ్ ఆమె తండ్రి భారత్ నుంచి ఉపాధి కోసం సింగపూర్ లో స్థిరపడ్డారు.తల్లి మలేషియా మూలాలున్న మలయ్ మహిళ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డాక్టరేట్ పూర్తి చేసిన హలీమా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ కార్మిక నాయకురాలగా ఎదిగారు. 2001 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2011 ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఏకైక మహిళా అభ్యర్థి హలీమా నే కావటం విశేషం 2017 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్పీకర్ పదవికి రాజీనామా చేసి అధ్యక్ష ఎన్నికల్లో దిగి విజయం సాధించారు హలీమా.

Leave a comment