ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, ఇలాంటి కారణాలు కాకుండా మనం రోజు బుజానికి తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్ బరువు కుడా తలనొప్పికి కారణం అవుతుందిట. మనం మోసే చేతి నుంచి మన శరీర బరువులో పది శాతానికి మించి వుంటే, ఆ బరువు ఓత్తిడిగా మారి ముందు బుజాలు, మెడ నొప్పికీ తర్వాత తలనొప్పికీ దారి తిస్తుందిట. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో అవసరానికి మించిన వస్తువులు పెట్టుకునే అలవాటు వుంటే స్వస్తి చెప్పండి అంటున్నారు నిపుణులు. బరువు మోయడం తప్పదు అనుకుంటే బ్యాక్ పాకెట్లు ఎలాగో ఫ్యాషన్ కాబట్టి అలా వాడటం మంచిదే. ఒక్కసారి బరువులు ఏమైనా ఎత్తాలంటే ఏళ్ళ బిగువున్నా ఎత్తేస్తాం. దాంతో మొహం కండరాళ్ళు బిగుసుకుని మొహం ఎర్రబడిపోతుంది. అప్పుడు కూడా తలనొప్పి వచ్చె ఆస్కారం వుంది. కదలకుండా గంటల తరబడి కూర్చుంటేనూ, బరువులు మోస్తుంటేనూ కూడా తలనొప్పి పట్టుకోవచ్చు జాగ్రత్త అంటున్నారు నిపుణులు.
Categories
WhatsApp

హ్యాండ్ బ్యాగ్ బరువు వల్లే ఈ ప్రాబ్లం

Leave a comment