నెదర్లాండ్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ లో హ్యాండ్ బ్యాగ్ ల మ్యూజియం ఉంది . దీని పేరు ఎ మ్యూజియం ఆఫ్ బాగ్స్ అండ్ పర్సెస్ . 1960 లో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు ఇక్కడ అరుదైన హాండ్ బాగ్ చూడచ్చు . అసలు హ్యాండ్ బ్యాగ్ లు 16వ శతాబ్దం నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి . 17 వ శతాబ్దంలో ఈజిప్ట్ మహిళలు పిల్లలు హ్యాండ్ బ్యాగ్ వాడినట్లు ఆధారాలు కనిపించాయి . కొన్ని శతాబ్దాల క్రితం పురుషులకు తను ఆయుధాలు జాగ్రత్త చేసుకొనేందుకు హ్యాండ్ బాగ్ వాడేవారు . రాను రాను పురుషుల వాడకం తగ్గి స్త్రీలు ఉపయోగించటం మొదలు పెట్టారు . ఇది పురాతన ఈజిప్షియన్ చిత్రాల్లో కనిపిస్తుంది . తవ్వకాల్లో దొరికిన ఎన్నో హ్యాండ్ బ్యాగ్ లు ఈ మ్యూజియం లో కనిపిస్తాయి . మహిళలు వాడే చిన్న హ్యాండ్ బ్యాగ్ 1840 లో లండన్ కు చెందిన హెబ్ జె కేఫ్ అనే కంపెనీ తయారుచేసింది . శామ్యూల్ పార్నెన్ సన్ అన్నా పారిశ్రామిక వేత్త పూర్తిగా లెదర్ ఉపయోగించి తన భార్యకోసం తయారు చేయించిన హ్యాండ్ బ్యాగ్ ఒక ట్రెండ్ లా మిగిలిపోయింది . ఈ మొట్టమొదటి హ్యాండ్ బ్యాగ్ ఆమ్ స్టర్ డ్యామ్ లో ఉంది . స్విడ్జర్లాండ్ కి చెందిన మేవాడ కంపెనీ తయారుచేసిన ఒక బ్యాగ్ గిన్నిస్ రికార్డ్ ల్లోనికి ఎక్కింది . ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు అక్షరాలా మూడుకోట్ల 45 లక్షలు 1001 డైమండ్స్ పొదిగి తయారు చేసిన ఈ బ్యాగ్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది
Categories